Tuesday, March 23, 2010

గాలిలో నేను...
అగ్గిలో నేను...
కాలాగ్ని చేతులో హరిన్చుకుపోయే,
కర్పూరాన్ని నేను...
బాధలో దహించుకుపోయే,
బాదాతప్త హృదయాన్ని నేను...
నేను నేనే...
నాకు నేనే...
    - రామకృష్ణ కొంగల్ల -
నేను పడిలేచిన కెరటం...
నా గమ్యం ఆమడ దూరం...
ఒక్క ఉదుటున చేరగలను...
కానీ...
రుచి లేని కూడు ఏల...
ఓటమి లేని ఆ గెలుపు ఏల...
   - రామకృష్ణ కొంగల్ల -
ఇన్నాళ్ళుగా నిద్రిస్తున్న ఆవేదన...
ఒక్కసారిగా తెంచుకున్న రోదన...
ఎదకు తెలియని మధన...
ఎదురు నిలిచిన సాధన...
తలలు పగిలే చింతన...
మదికి దొరకని స్వాంతన...
నా లేఖనం...
నా కవనం...
 - రామకృష్ణ కొంగల్ల -

మూడు చుక్కలు... నా కవితలు...

ఎన్నో చెప్పాలనుకుంటాను... నీ ముందు మూగ బోతాను...
నీ నవ్వే చూడాలనుకుంటాను... నీతో కలిసి ఎంతో నవ్వుతాను...
నిన్ను కలవాలనుకుంటాను... తెలియకుండానే నీకై ఎంతో నడుస్తాను...
నిన్ను తలుచుకుంటాను... వెంటనే చుట్టూ నీకై వెదుకుతాను....
నేస్తామా...
ఈ ప్రపంచమంతా నీవైతే ఎంత బాగుండు...
- రామ కృష్ణ కొంగల్ల -
మతం మతం అంటే...
నువ్వూ నేను హతం హతం...
మతం అంటే ఒక్కటే సత్యం...
మతం అంటే మన నడక...
మతం అంటే మన నడవడిక...
- రామ కృష్ణ కొంగల్ల -

మూడు చుక్కలు... నా కవితలు...

తడబడిన ప్రతి అడుగు తాగినప్పటిది కాదు...
వనకబడిన ప్రతి క్షణం ఓడినప్పటిది కాదు...
ఆనందం కలిగించిన ప్రతీది అమూల్యం కాదు...
దుక్కింప చేసిన ప్రతీది చెడ్డది కాదు...
- రామ కృష్ణ కొంగల్ల -

మూడు చుక్కలు... నా కవితలు...

అన్నం పెడుతూ ఆకలిలో అమ్మవు...
మందలిస్తూ... తప్పటడుగుల్లో నాన్నవు...
దారిదూపుతూ జీవితంలో గురువు...
కన్నీటి బాధలో నా నేస్తానివి నీవు...
విరిసే ప్రతి నవ్వు వెనక నువ్వు...
నా ప్రతి చిరునవ్వు వెనక నువ్వు...
- రామ కృష్ణ కొంగల్ల -

మూడు చుక్కలు... నా కవితలు...

సాప కింద నీరు...
నెత్తి మీద పోరు...
ఇరుగు పొరుగు ఇరుకు...
ఏమడలేను ఇంతసోట్లో...
నా ఎడద విశాలం...
ఇదంతా ఇరుకు ప్రపంచం...
- రామ కృష్ణ కొంగల్ల-

మూడు చుక్కలు... నా కవితలు...

అనుభవం వయసైతే
స్థలం నా కులం...
ప్రేమ మా అమ్మ...
చెలిమి మా నాన్న...
ఏకాంతం నా ఆలి...
-R'tist-