Wednesday, January 22, 2014

శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు

గండు వారి పెళ్లి పిలుపు

స్వస్తి శ్రీ విజయనామ సంవత్సర, సప్తమి శుక్ల, గురువారం అనగా ఫిబ్రవరి, 6, 2014, ఉ 9.40 ని !! లకు
భరణి నక్షత్ర మేష లగ్నమునందు

చి. ల. సౌ !! శారద
(శ్రీమతి & శ్రీ సింగయ్య, నవభారతి ల ఏకైక పుత్రిక)

వివాహము

చి. రామకృష్ణ కొంగల్ల
(శ్రీమతి & శ్రీ శ్రీశైలం పార్వతమ్మ ల ఏకైక పుత్రుడు)

 తో జరుపబడును. కావున తామెల్లరు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నవ వధువరులను ఆశిర్వదింప ప్రార్థన

మీ ఆగమనాభిలాషులు
శ్రీమతి & శ్రీ సింగయ్య, నవభారతి
మరియు కుటుంబ సభ్యులు

వివాహ వేదిక : అశోక్ రెడ్డి గార్డెన్స్, కొట్ర గేటు, కొట్ర, కల్వకుర్తి, మహబూబనగర్ !!జి !!

విందు: మ. 12.00 నుండి 2.00 గం!! వరకు, సోమవారం, పిబ్రవరి, 10, 2014,
ఒమ్మెవరం, ఎన్. జి పాడు, ఉప్పుగుండూరు, ప్రకాశం !!జి!!

Sunday, December 22, 2013

అడగని ఆనందానిస్తావు... అదుపు లేని దుఃఖంలో ముంచుతావు...
అడిగినవి ఏనాడు ఇవ్వని నువ్వు, ఇప్పుడెందుకు ఆదరిస్తునావు...
ఒంటరితనంలో నన్ను ముంచి, ఒడిదుడుకులే నేస్తాలను చేసావు...
బంధాలను బందుత్వాలను త్రుంచి, నాకు నచ్చని నరకంలో పడేసావు...
కాటికి కూటికి తేడా తెలియనివ్వక, కర్కశంగా జేవితంలో కన్నీరు నింపావు...
లేత భుజాలపై కొండంత బరువులు మోపి, అనగారుతున్న నన్ను చూసి ఆనందించావు...
నువ్వు లేవన్న  నా దృష్టిలో ఇప్పుడిప్పుడే, నేనున్నానని ఆసలు కలిగించావు...
ఎన్ని రోజులు ముళ్ళపై నడవను, ఇంకెన్ని రోజులు కుమిలి కుమిలి ఏడవను...
దేవుడా...!!!  ఈ  జీవితం నాకొద్దు... నే కోరని ఆనందాలు నాకు ససేమిరా వొద్దు...!!!


Tuesday, September 17, 2013

నీవెవరో అయిన నిన్నలో...
ఆకృతి లేని అసహనాన్ని నేను...
అపుడు నీవొక అజ్ఞాతానివి మాత్రమే...

ఆసల్లో హరివిల్లువై... మనస్సులో మమతవై...
పదాలకు నెలవై... నా కళానికి  సిరవై...

సాగనీ నా నూరేళ్ళ మజిలీ నీతో...
అందులోని నా ప్రతి అడుగు నీతో...

మెరుపన్నాను ... మైమరపన్నాను...
ఆనందపు పునాదుల్లో, ఆశల మేడకు నగిషీలు అద్దాను...
ఒక్కొక్క నీ మాటలో, కోటలు కట్టాను...
నీ చిరునవ్వుల ముడతల్లో, ఊహల రంగులు అద్దాను...

అంతా నువ్వయ్యావు... అనంతానివే నువ్వయ్యావు...

ఇప్పుడు నీవు నాకొక అద్వితీయానివి...
నా జీవితానికి నీవొక ఆలంబనవి...

నా దారిలో నీవు నడిచిన నాడు...
పువ్వునై  నీ దారిలో రాలిపోతా...!!!

రాలిన పువ్వు నీది అనుకున్న నాడు...
శాశ్వతంగా నీ శ్వాసలో పరిమలిస్తా...!!!

Monday, July 15, 2013

అణువణువునా మీరు... ఆలోచనలంతా మీరు...
తప్పటడుగులు నేర్పారు... తప్పుటడుగులు వద్దన్నారు...
ప్రతి విషయంలో మీరే పెద్ద ధిక్కై...
ఇప్పుడు అందనంత పెద్దవారయ్యరు...
నన్ను మీ కుడి భుజం అన్నారు... నా భుజాన్ని అమాంతం విరిచారు...
మీరు పంచిన ప్రేమను, నాకీ ప్రపంచంలో ఎవరివ్వగలరు నాన్నా...
ఇలా పదాలు ఎన్ని వెతికినా, మీ ముందు చిన్నబోతాయి నాన్నా...
మీ ఆత్మకు శాంతి చేకూరాలని --- మీ--- కాశీ విశ్వనాధ్...

Wednesday, July 10, 2013

నడిచేటి దారిలో... నా ప్రతి అడుగులో...
నీ సహవాసం చేస్తా... నా సహజాతనవుతా...
నువ్వు చేసిన ప్రమాణాల్లో... నా హృదయ నివేదనలో...
నా చేతలన్నీ రాతి కోటలు... నీ మాటలన్నీ నీటి బుడగలు...
నీ జ్ఞాపకాల్లో... నా రక్తపు మరకల్లో... ఎర్రని పువ్వునై వికసిస్త ...
నీ పాద ధూళిలో... నా తుది శ్వాసలో... కన్నీటి పర్యంతమవుత...
నీ హృదయ కుటీరంలో.. నా కళేబరంలో...
నువ్వు చంపిన నా ప్రేమను అజరామరం చేస్తా...     R'tist (10th July 2013)

Thursday, October 25, 2012

నీవేవరితో నడిచినా... అది గతమే....
నాతో రెండడుగులు నడువు... అందులోని ప్రతి క్షణాన్ని బంగారు అక్షరాలతో దిద్దుకుంటా...
నీవేవరితో మాట్లాడినా వింటారు అంతే...
నాతో రెండు మాటలు మాట్లాడు... ప్రతి పదాన్ని హృదయంలో పదిల పదిల పరుస్తా...
నాతో నువ్వున్న సమయాన్ని ఆగిపోమ్మని వేల సార్లు కోరుకుంటాను...
నాతో నువ్వు నవ్వుకున్న ఊసుల్ని నయనాల్లో దాచుకుంటాను...
నీ జీవితంలో ఎంతో మంది వచ్చిపోతారు.. నిన్ను మరుగున వేస్తారు...
నా జీవితం లోని నిన్ను మాత్రం...
శాశ్వతంగా పదిలపరుస్తా... ఆరాధిస్తూ కోవెల కడతా...
నన్ను పట్టించుకోని నాడు  నీకు కన్నీటి  అభిషేకాలు చేస్తా...
నేను నిన్ను ప్రేమిస్తేనే కదా... నీకు ఈ ప్రపంచాన ఓ విలువ...

Wednesday, September 5, 2012

కొత్త కుర్రకారుకి...
కొంగ్రొత్త పట్టు పరికినీలకు...
స్వగతాల స్వాగతాలు పలకాలని...
తెలుగు హృదయం ఆరాటపడుతోంది...
దిక్కులు పిక్కటిల్లేలా కేరింతల మధ్య...
నూతన ప్రపంచానికి, కొత్త జీవితానికి...
నవ తెలుగు ఆహ్వానం పలుకుతోంది...

 తేది: 08-09-2012, శనివారం
సా!! 5.00 గం!! లకు, జే.యెన్. ఆడిటోరియం