Thursday, October 25, 2012

నీవేవరితో నడిచినా... అది గతమే....
నాతో రెండడుగులు నడువు... అందులోని ప్రతి క్షణాన్ని బంగారు అక్షరాలతో దిద్దుకుంటా...
నీవేవరితో మాట్లాడినా వింటారు అంతే...
నాతో రెండు మాటలు మాట్లాడు... ప్రతి పదాన్ని హృదయంలో పదిల పదిల పరుస్తా...
నాతో నువ్వున్న సమయాన్ని ఆగిపోమ్మని వేల సార్లు కోరుకుంటాను...
నాతో నువ్వు నవ్వుకున్న ఊసుల్ని నయనాల్లో దాచుకుంటాను...
నీ జీవితంలో ఎంతో మంది వచ్చిపోతారు.. నిన్ను మరుగున వేస్తారు...
నా జీవితం లోని నిన్ను మాత్రం...
శాశ్వతంగా పదిలపరుస్తా... ఆరాధిస్తూ కోవెల కడతా...
నన్ను పట్టించుకోని నాడు  నీకు కన్నీటి  అభిషేకాలు చేస్తా...
నేను నిన్ను ప్రేమిస్తేనే కదా... నీకు ఈ ప్రపంచాన ఓ విలువ...

Wednesday, September 5, 2012

కొత్త కుర్రకారుకి...
కొంగ్రొత్త పట్టు పరికినీలకు...
స్వగతాల స్వాగతాలు పలకాలని...
తెలుగు హృదయం ఆరాటపడుతోంది...
దిక్కులు పిక్కటిల్లేలా కేరింతల మధ్య...
నూతన ప్రపంచానికి, కొత్త జీవితానికి...
నవ తెలుగు ఆహ్వానం పలుకుతోంది...

 తేది: 08-09-2012, శనివారం
సా!! 5.00 గం!! లకు, జే.యెన్. ఆడిటోరియం

Tuesday, September 4, 2012

చిన్న ఎదకు అనంత వ్యధ
లేలేత భుజానికి మోయలేని వెత
కళ్ళకు శోక సంద్రాలే సహవాసాలై...
పళ్ళున్న నా నోరు నవ్వదెందుకు ...
నవ్వలేని నా మనసు మూగదెందుకు ..
మూగవోయిన నా కంట తీగలు తెగనీ...
వాటిని నేను మళ్ళీ సవరించనీ...
ఒడి దుడుకుల అడుగులు, అల్లకల్లోల శ్రుతులు...
కాలమా నీ వెంట నేను రాలేను...
నన్ను వదిలెయ్... ఈ జీవితం నాకొద్దు...      -రామకృష్ణ-

Saturday, August 25, 2012

నిద్ర లేవగానే నా దేశం లో...
లంచాలు... కుంభకోణాలు... మాన భంగాలు... మౌనరొదలు...
కత్తులు... కార్పణ్యాలు... హత్యలు... దొంగతనాలు...
రోడ్డు ప్రమాదాలు... ఆసుపత్రి చావులు... ఆకలి కేకలు... ఆర్తనాదాలు...
రైతు హత్యలు... కార్మిక వెదలు... పేదోడి దోపిడి... ధనవంతుల దౌష్టం...
కళాకారుల కష్టాలు... కళలకు కర్మకాండలు... సంస్కృతికి చీడ పురుగులు...
పాశ్చాత్య మోజులు... డాలర్ల క్రేజులు... మత కుమ్ములాటలు... కుల తన్నులాటలు...
తమిళం, హిందీ, బంగ్లా, తెలుగు, కన్నడం... చచ్చిపోయింది భారతీయం...
జనాల కన్నా జెండాలు ఎక్కువై... ప్రాణాల కన్నా పార్టీలు ఎక్కువై...
ఎన్నుకున్న జనాన్ని మరిచి... కుర్చీల కోసం తన్నుకునే నాయకులు పుట్టారు...
సౌజన్యం, ఉదారత, పావనత, ప్రశాంతత అన్నింటిని మించి అద్యాత్మికత అంతర్వీక్షనాలను
మానవాళికి అందించిన మహత్తరమైన మన పుణ్యభూమి ఎక్కడ...??? రామకృష్ణ కొంగల్ల

Tuesday, August 14, 2012

నా దేశం లో...
అనంత సంపద వుంది... అందలం వుంది... ఆక్రోశం వుంది... ఆవేశం వుంది...
అనాధలున్నారు... అభాగ్యులున్నారు... ఆకలి వుంది... అంధ రాజులున్నారు...
కోటిశ్వరులున్నారు... కూటికి లేనోళ్ళు వున్నారు... ఆకాశ హర్మ్యాలున్నాయి... పూరి గుడిసెలున్నాయి...
మత చాన్ధసముంది... కుల రాక్షసి వుంది... తీవ్రవాధముంది... వేర్పాటు వాదముంది... ఆరక్షణ వుంది...
దోపిడీవుంది... రౌడియిజముంది... రాజకీయముంది...
దళారులున్నారు... లంచగొండులున్నారు... రాజకీయ నాయకులున్నారు...
చేతగాని తనముంది... నీరసముంది... నిర్లజ్జుంది... దేశ భక్తి మంట గలిసింది...
ఆరు గజాల చీరలు మాయమై, అడ్డ పంచెలు మాయమై, పట్టు పరికిణీలు మాయమై,
బ్లేజర్, బికినీలు పాకిన నా దేశం లో...
నా త్రివర్ణ పతాకం అందమైన భామల మాంసపు ముద్దలపై నమూనాగా నిలిచింది...
పంద్రా ఆగస్టు సెలవు దినమైంది...
భారతమాత  నన్ను కన్నందుకు గర్వపడుతున్నా...
ఆమెను నడిరోడ్డున తన వాళ్ళే దోస్తుంటే, ఏమి చేయలేక సిగ్గుపడుతున్న...
భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడుతున్న...
భారతీయుడిగా బ్రతక లేక పోతున్నందుకు సిగ్గుపడుతున్నా...!!!

Monday, July 30, 2012

పలక లేని స్వరం లేదు... రాయ లేని శబ్దం లేదు...
అన్ని కాలాల్లో, ఎల్ల విషయాల్లో అలవోకగా ఒదిగిపోయే నా తెలుగు...
అనంత కోటి ప్రజా సముదాయం నా తెలుగు... రక్త చలన సామవేదం నా తెలుగు...
తల్లి పాల తీయదనం నా తెలుగు... బుడి బుడి అడుగుల బోసితనం నా తెలుగు...
లేత మీసాల ఆవేశం నా తెలుగు... పదహారణాల పడుచు సింగారం నా తెలుగు...
అమరం నా తెలుగు.. అజరామరం నా తెలుగు... అనంత కీర్తి నా తెలుగు...
అక్షరాల్లో దగ్ధమవుతూ నా తెలుగు... అజరామర గీతమై పలికే నా తెలుగు...
కృష్ణ రాయలు, సుబ్రమణ్య భారతి, చక్రవర్తులు, శంకరాచార్యులు లెస్స యన్న తెలుగు...
నా తెలుగు... నీ తెలుగు.. మన తెలుగు...
అన్య భాషా కలంకమై రోప్పుతోంది... సమస్తం కంధశీకమవుతోంది...
చ్చల్.. హైస్సా.. లే... నేస్తమా...
నిన్ను నిలబెట్టిన తెలుగు భాషను, నువ్వు నిలబెట్టు...!!!

Sunday, July 29, 2012

చూపులతో మొదలై... చూడకుండా నిలవలేని ఆత్రత తో...
గంటల కొద్ది మాటలు... చెవులకు కట్టుకున్న దూరవానులు...
నిరంతర సందేశాల మార్పిడి... చెట్టా పట్టాల  ఒరవడి...
ప్రపంచెం లో ఇంత మందెందుకు... నువ్వు నేను సరిపోమా...
నేను నీకు మాత్రమే.. నువ్వు నాకు మాత్రమే అనుకుని...
నీలోని నిన్ను నువ్వు కోల్పోయి... నాలోని నన్ను నేను కోల్పోయి...
నాకు నచ్చినట్లు నువ్వు... నీకు నచ్చినట్లు నేను వుండలేక...
సంబందాలకు అక్రమ సంబందాలకు తేడా తెలియని సమాజంలో...
ప్రేమ - స్నేహం ఒకటే అనుకునే అమోఘమైన  యువత లో భాగం నువ్వు-నేను...
నేడు  ప్రేమంటే ఒకటే ప్రతీక... అదుపు లేని కామం... అవధుల్లేని దుఖం... !!!

Friday, July 27, 2012

ఎన్నో మూటల మాటలు చెబుతావు... వాటితో కోటలు కట్టొచ్చు...
నీవు నాకు వునావన్న భరోసా మాత్రం కల్పించవు...
ఊహల్లో ఉయ్యాలలూపి... కళల తీరంలో కబుర్లు చెబుతావు...
నీవు నాకు మాత్రమేనన్న నమ్మకాన్ని కల్గించవు...
నాతో పాటు దూరాలు నడిచి... ఒంటరి తనాన్ని తరుముతావు...
నిరంతరం నడకలో తోడుగా ఉంటానన్న భద్రతను బహిర్గతం చేయవు...
నా ఆనందాన్ని అందుకుంటావు... వాటి కారణాలు చూడవు...
నా బాధలో తోడవుతావు... బాధల నేపధ్యం గానవు...
నా కన్నీటి దారాలు నిరోదిస్తావు... వాటి మూలాలను అన్వేషించవు...
నా కోసమే బ్రతుకుతూ... నిన్ను నీవు మరవకు...
నిన్ను నీవు మరిచి... నన్ను మాత్రం మరుగున వేయకు...!!!

Wednesday, June 27, 2012

తనను వర్ణిద్దాం అనుకున్నానా..,
అనుకున్న ఆలోచనలు చేజారి... చందమామ లా చల్లని భావాలై...
భావాల కెరటాల్లోని కేరింతలు... కేరింతల కలం లోని కవ్వింతలు...
కవ్వింతల కాగితపు వాసనలు... వాసనల వేవేల నయనాలు...
నయనాల ముక్కోటి మురిపాలు... మురిపెం లోని ముత్యాలు...
ముత్యాల చేచిక్కని పాద కుసుమాలు... కుసుమాల నవ మన్మధ బాణాలు...
బాణాల మకరందపు మువ్వలు... మువ్వల వలె భానుని భరినెలు...
భరిణె లో పసుపు కుంకుమ చందనాలు... చందనాల పసిడి వెండి పూరేకులు...
పూరేకుల పొద్దు తిరుగుడు చేమంతి చెక్కిళ్ళు... చెక్కిళ్ళ పై అప్పుడే మొలిచిన సిగ్గు వజ్రాలు...
వజ్రాల తెల్లని పళ్ళ వరుసలు... పల్లల్లోని ముత్యాలు జారి మెడ మంగళ హారాలై...
నఖ శిఖ పర్యంతం సర్వం, సమస్తం, నివ్వెర పోయ్యేను...
ఓ... లావణ్య లలనా... !!! నాలుగు పంక్తుల్లో నిన్ను వర్ణింప,  నేను తగునా...!!!


Tuesday, June 26, 2012

అతనొక  రైతన్న... నేడు ఆ బిరుదు నరకానికి ఆలంబన...
తనలా కాకూడదని తన కూన...
పలచ బడుల పై ఆశ లేక... పైసా బడులను నమ్ముకుని...
లేక్కకందని రుసుముకు ఓర్వలేక... నమ్ముకున్న భూమిని అమ్ముకుని...
లచ్చలు వెచ్చించి చాదివిన్చుకున్న  తన కొడుకే... తన శ్రమ చుక్కాని చివరి మజిలీ...
డిగ్రీలు పొంది... పట్టాలనొంది... లేలేత అడుగులేసి... పల్లేరుల పథం లో...
రిజర్వేషన్ కోరల్లో చిక్కి... అనాగరిక ప్రశ్నలకు  సమాధానం చెప్పలేక...
అప్పుల కుటుంబాన్ని ఆదుకోలేక... ఉద్యోగం సాధించలేక... నోట్ల గారడీ చేయలేక...
ఎగిరే వయసును ఆపలేక... కోరికల చట్రాలను పట్టలేక... విలువలకై నిలబడలేక...
మనసుకు నచ్చని పనులు జేసి... క్షణం క్షణం చచ్చి బ్రతికి...
తోటి వారు తరలి పోతే.. నీవు మాత్రం తెరలు తెరలుగా ఏడ్చి...
చదువు విలువలు నేర్పింది... సమాజం వలలు విసిరింది ...
వెకిలి నవ్వుల వింత కోరల కింద నీ జీవితం విల విలలు  చూసింది...
సర్వం మస్తిష్కం లో ఉంచిన ఓ... విద్యా జీవి... ఈ సమాజాన నీవొక వ్యర్థ జీవి...!!!

Friday, May 25, 2012

 దశా దిశా లేని మీడియా ను  తులనాడుతూ...పెరిగిన ధరలకు కేంద్రాన్ని నిందిస్తా...
నా ఇంట్లో చెత్తను పక్క వాకిట్లో వేస్తూ... రోడ్లపై ఉమ్మితే ప్రభుత్వాన్ని భాధ్యున్ని చేస్తా...
పెరిగే మానబంగాలకు ప్రతి మగాడిని బాద్యున్ని చేస్తూ... తొడల పైకి మిడ్డి వేసే ప్రతి ఆడదాన్ని తిడతా...
పైరసీ ని తిడతా... సీరియల్స్ ను తిడతా... సినిమా ల ను తిడతా... ఫారిన్ కల్చర్ ను తిడతా...
క్రికెట్ కు దేశ భక్తి కి ముడిపెట్టి... గెలిచిన ప్రతిసారి జెండా తో వీధి వీధి తిరుగుతా....
ఆకలి చావుల్లో నా దేశం వెలిగి పోతున్ధంటూ... లక్ష కోట్లు తిన్న వారిని పార్లమెంటు లో కూర్చోబెడతా...
నా దేశం బీధదని నిట్టూర్చి బిరియాని తింటూ... ఆడీ కారు లో కుర్చుని వీధి బాలున్ని విసుక్కుంటా...
రిజర్వేషన్ పేరుతో యువతును పీడించే రాజ్యాంగాన్ని నిందిస్తూ... 
సత్యమేవ జయతే  చూసి కసిగా కన్నీరు  పెట్టి మరిచిపోతా...
చెత్త ప్రభుత్వం అని తిడతా కాని... పచ్చ నోటు కు ఆశపడి వోటు వేసిన వేదవను నేను కాదనుకుంటా...
దేశమంతా దొంగలు లంగలు ఉన్నారంటూ... నేనొక్కడినే ఆరిందను అనుకుంటా...
ఎన్ని యుగాలు గడిచినా... నేను అభివృద్ధి చెందే వాడినే అంటూ...
వీటన్నింటికీ... నేను మాత్రమే కారణం అన్న విషయం మరిచిపోతా... 

Tuesday, May 15, 2012

7 రంగుల పుడమి... 7 మతాల లోగిలి...
7 అడుగుల అజానుబావులు... ఎదలు పొంగే కధలు...
7 అంతస్తుల అద్దాలమేడ అంచున... 7 అడుగుల గుడిసెలు...
7 వేల కోట్లు తిన్న దొంగలకు... 7 నెలలే ఊచలు...
7 రాజకీయ కుర్చీలకు... 7 వేల మంది ఊగిసలు...
7 రోజులు సరిపోని హడావుడి ప్రపంచెం లో... 7 నెలలకే కానుపులు...
7 ఏళ్ళ చిచ్చర పిడుగులు... ఏడిచే వింతలు...
7 కొండల వాడి సమక్షం లో... ఎడతెగని కోర్కెల బక్తులు... 
7 గజాల చీరపై కి.. 7 ఇంచ్ ల బుజాలు లేని జాకెట్లు...
7 మీటర్ ల విసురు రోడ్ల పై... అలుపెరుగని పయనాలు....
7 అడుగుల తలంబ్రాలు... ఎ 4 విడాకు పత్రాలు...
7 ఖండాల్లో... సప్త సంద్రాల్లో.... నాటికి నేటికి... ఎంత చెప్పినా... ఒడవని కథ...
నా భారతం... అనంత భారతం... 
నా భారతం... అమర భారతం...

Thursday, May 10, 2012

ఒక్కరోక్కరు వెళుతున్నారు... 
ఒక్కొక్కరుగా  వెళుతున్నారు...
ఒక్కొక్కరే అయి వెళుతున్నారు...
గంటల పరిచయాలు... గతుల జ్ఞాపకాలు...
క్షణాల మాటలు... యుగాల ఊసులు...
ఆసాంతం మురిపించి... అమాంతం ఏడిపించి... 
స్మృతులు మిగిల్చి... ఎదలు చితులు చేసి...
కానలకేగినట్లు కనపడక పోతారు... 
అదుపు లేని పాశం.. అవధులు లేని శోకం...
కలిసి తిరిగిన పర్వం... గర్వం... గంభీర్యం... 
ఏ చోట వెతకను... నీవు సర్వాంతర్యామి వి...
నువ్వు వెళ్ళిన నన్ను... ఒంటరినని వెక్కిరించే...
పరిసరాలకు ఏమని చెప్పను... నేస్తమా.... నేస్తమా....
పూలు అమ్మిన చోట... కట్టెలు అమ్మడం.. నాకు చేతకాదు...

Friday, May 4, 2012

మొదట చేరినప్పుడు 
మౌనంగా నా గదిలో ఒంటరిగా ప్రాంగణం లో 
ఆశలు ఆశయాలు లేని మనసు భారంగా వున్నప్పుడు 
అమ్మ నాన్న అక్క చెల్లి అన్నదమ్ముల మాటలు మెదులుతున్నప్పుడు 
ఎడారి లో ఎండమావి లా నీ పలకరింత నీ పరిచయం 
ఒక్క పూట ఒక్క రోజు ఒక్క వారం ఒక్క నెల ఒక్క వత్సరం 
ఇప్పుడదంతా ఒక్క జీవితం 
కలిసి తిరిగిన రోడ్లు చెట్లు  పుట్టలు
కన్నీరు తెప్పించే సరదా కబుర్లు చేట్టాల్ పట్టాలు 
నీ ధైర్యం తో చేసిన పనులు ఒకటా రెండా 
నా రోజు నీ తో మొదలు నా రోజు నీతో తుదలు 
నవ్వాం ఏడ్చాం స్వర్గాన్ని చూసాం...
కలిసి నిల్చున్నాం ఎదురు నిలబడ్డం 
ఇద్దరం ఒక్కటై ప్రపంచాన్ని ఆస్వాదించాం 
ఇద్దరం వున్నా ప్రతి క్షణాన్ని ప్రేమించాం 
మనది అనుకున్నాం మనదంటూ ఏదో వున్ధనుకున్నాం 
ఏమి లేకుండ్డా వెళుతున్నాం 
నీ వద్ద నా ఎద నా వద్ద నీ ఎద తప్ప 
ఆహే చ్చల్... ఎంతని బాధపడను నేస్తమా...
ఎవరున్నా లేకున్నా... పూచే పూలు పూస్తూనే వుంటాయి...
 

Saturday, April 14, 2012

ఎలా చెప్పను నీకు నేను...?  నాకోసం నీవు ఎవ్వరని... ?
ఏమి చెప్పను నీకు నేను...? నాకోసం నీవు ఎవ్వరని...?
హృదయ లయవు... సంగీత సరిగమవు... జీవితానివి నీవు... బందనానివి నీవు...
నీవే ప్రకాశం... నీవే పరిమళం... నీవే దుఖం... నీవే సుఖం...
ప్రేమవు నీవు... ప్రేమ గీతానివి నీవు... కళ్ళలో నీవు... జ్ఞాపకాలలో నీవు...
నిద్రలో నీవు...  నిరంతర హృదయ సవ్వడిలో నీవు...  ఉచ్చ్వాసలో నీవు... నిష్వాసలో నీవు...
 నీవే ప్రతి మాటలో... నీవే పగలు రాత్రిలో... వేకువలో నీవు... సంజ లో నీవు...
పనిలో  నీవు... మదిలో నీవు... తూర్పున నీవు... పడమట నీవు...
నాకోసం వున్నా నీవే... నను వీడినా నీవే... నాకోసం నవ్వినా నీవే... నాకై ఏడ్చినా నీవే...
లేచినా పడుకునా ఎక్కడికెళ్ళినా ఎటు చూసినా... సర్వం నువ్వే... అంతా నువ్వే... అనంతం నువ్వే...
ఎలా చెప్పను నీకు  నేను...?  నీవు లేని నేను శూన్యం...!
ఎలా చెప్పను నీకు నేను...?  నాకోసం నీవు ఎవ్వరని... ?

Friday, March 30, 2012

ఆస్తులు పెర్గుతున్నై...
బ్యాంక్ ఖాతాలు మూల్గుతున్నై
దఫా దఫాలు గా రోడ్లు విసాలమైతున్నై
అర అరలు గా మన అర్రలు వెడెల్పు ఐనై
తెర తెరలు గా ప్లాటినం స్క్రీన్ లు పెద్ధగైనై
మనం తిరిగే కార్లు కరీధైనై
వేసుకునే ఖద్దరు చొక్కాలు తెల్లగైనై
దునియాల మొత్తం ఇసాలమైనై.... కాని...
మానవత్వం మరిసి...సాయం చేయలేక... బుక్కెడు బువ్వ పెట్టలేక...
మన గుండెలు ఎందుకు రోజు రోజుకు కుచించుకు పోతున్నై...

Friday, March 23, 2012

ఎందరో మహానుభావులు అందరికి మా వందనాలు...
వేన వేలు కలిసిన చేతులు... పేరు పేరున ప్రత్యేక దండాలు...
రుచులలో మమేకమై... రుచి రుచి గా వడి వడిగా...
స్వాగతించిన వారికి...వడ్డించిన వారికి...
నీరు అందించిన వారికి... తోడు నిలిచినా వారికి...
నలుసు ఎత్తిన వారికి... శుబ్రపరచిన వారికి...
నవ్వించిన వారికి... మనతో కలిసి నవ్విన వారికి...
ఆడిన వారికి.. పాడిన వారికి... అఆదించిన వారికి...
ధరి చేరిన వారికి... దారి చూపిన వారికి...
ప్రియమైన సోదరులు... తెలుగు ఆడపడుచులు...
తెచ్చిన అందం... వచ్చిన ఆనందం... అనంతం అద్భుతం...
అందరికి మీ అందరికి... మా...  వందనాలు...
ఉపాధ్యాయులకు సాదర ప్రణామాలు...
భోజనానికి విచ్చేసిన ప్రతి నేస్తానికి జయహో... జయహో...

Tuesday, March 20, 2012

నడిచేటి దారిలో... నా కంటి పాపలో... 
నీ కొరకు చూసినా... నీ రూపు దాచినా...
మురిపించే... మైమరిపించే...
ఆర్ధ్రమా...ఆత్రమా.. స్వప్నమా...
ఎద ధాటి వెళ్ళినా... ఎదురీది చేరినా...
మన గమ్యాలు రెండు కొసలు...
వ్యక్తిత్వాల అంతరం అగమ్య గోచరం...
ఓ... పిల్లా... చూడు... మనసు తెలిసి బాసాడు...
నా ముళ్ళ దారిలో... నీ పయనం ఎన్నాళ్ళు...
ఆ కంచే దాటిన ఆనందం గడియలు...
భయం... వొదులు... వెళ్ళు... వెంటాడు... నైన మెరుగని వైనం...
క్షణం క్షణం మరణం... ప్రతీ క్షణం మధురం...
మరణ పాదాలు ముద్దాడి ప్రాకృతిక ప్రపంచం నుండి...
వేరై... విదియై... వెలియై... ఎడమై...
పొరలు పొరలు గా ఒలవబడి... శాఖ శాఖలు గా విరవబడి...
సాగనీ నన్ను... కదలనీ నన్ను... 
కానల్లో... కన్నుల్లో... కరునల్లో....
కానరాని కర్కశం లో... నా సహజాత కవితల్లో... 

Sunday, March 18, 2012

తప్పులు... తెప్పలుగా... ఒప్పులు... ఉప్పెనలుగా...
చేసే పనులకు బేరీజులు... నా నేస్తాలు... హూం.... హూం...
కనపడక... కానపడక... కానలకేగని... కన్నీరై మిగలని...
దోరుకుదురు పో.... దారిలో... దొడ్డగా... దోస్తులంతా...
తోడు నిలవలేని నేస్తాలు... వుంటేనేమి... ఉరిమి ఊడితేనేమి...
నాన్ పోయే దారిలో నావారు తగలక పోరు... కొరికి చూద్దును కదా గడ్డ గట్టిన నెత్తురు...
ఎవరికీ వారు స్వార్థపరులు నాలాగా... ఒట్టేసి బలకనా... అవసరాలకే అనుబంధాలు...
మనోవాన్చకే మానవ సంబంధాలు... లెక్క లెక్క కడుదును వలపుల విలువలు...
నమ్మూ నమ్మక పో...
రమ్మనలేదు వచ్చారు... పొమ్మన లేను పోతారు...అనివార్యం పరివర్తనం...
అందులో నేను... అసమాప్త అసహనాన్ని...
అందులో నేను... ఆకృతి లేని నిర్లజ్జ నిస్సహాయాన్ని...

Thursday, March 8, 2012


పిల్ల గాలి లో నాట్యించు... నీ ముంగురులు... ప్రొద్దు తిరుగుడు పూ వదనం... 
గానం... అమృతం... మీనం... నీ నయనం... రెప్పల తలపుల లో... 
అనంత... భావన... అద్వితీయ చింతన... 
నేస్తమా...
కురు కురు ల పై... కాంతి... సూరీడి క్రాంతి... 
పంటి పంటి పై... ముత్యాల... హొయలు... విరాజిల్లు కుసుమాలు... 
మేని... వయసు... మనో వయసు... మమతల... హోయస్సు... మన హవిస్సు...
మతాబు... మంచి కితాబు... సర్వేంద్రియ... శోకాబు... 
నేస్తమా... 
కరము... కరము... కమనీయ... కేంద్రిత... కోలాహలము...
వయ్యారి... వంపుల్లో...  కదిలే... వాలు... వ్రాలు... సుగంధాలు... సుష్మాలు.... అజరామరం... ఆహాతనం... అబ్బురం...
నేస్తమా.... 
హావం... భావం... నా  మదిని  దోచిన... గాంభీర్యం... 
సవాలు... సవాలు... గా... పదాలు అల్లి... అల్లియనా... అందిన... 
నా హస్తానికి... నా కలం... పుష్పాంజలి... మనో... సుమాంజలి...
--------------------------------------------- R ' tist ...

Tuesday, March 6, 2012

చర్చకై తెలుగు బిడ్డలకు ఇదే మా ఆహ్వానం... 07 - 03 - 2012  సాయంత్రం 5 గం!! లకు పాన్లె దగ్గెర...


తెలుగు భోజనం అందరికా..??? లేక.... కొందరికా... ???
వచ్చి టి-షర్టు నాణ్యత చూసుకోండి....!!!  మీకు నచ్చిన రంగు  ఏంటి...???  మీ కొలత ( s m l xl ) ఏంటి...??? 
సాంస్కృతిక కార్యక్రమాలను ఏ విధంగా జయప్రదం చేద్దాం... అందుకు మీ వంతు చేయూత...!!!
క్రీడా దినోత్సవం ఎప్పుడు...???  డబ్బు ఇచ్చిన వాళ్ళు ఎందరు...??? ఇవ్వని వారు ఎందరు...???
ఖజానా లో సొమ్ము ఎంత వుంది...??? ఇంకా ఎంత కావాలి...??? 
మరవకండి... బుధవారం  సాయంత్రం... డి. డి. ఈ. దగ్గెర...


తెలుగు భోజనం - 23 - 03 - 2012 , సాంస్కృతిక కార్యక్రమాలు - 25 - 03 - 2012 
- పాండిచేరి విశ్వవిద్యాలయం తెలుగు విద్యార్థులు 

Tuesday, February 14, 2012

ఖండాలు దాటిన ఘనత మన కవిత... జగతినేలిన పదం మన జానపదం...
ప్రతి మదిని దోచిన మాట మన పాట... అవ్వనే ఆడించిన ఊట మన ఆట...
 తెలుగు బిడ్డలకు ఇదే మా ఆహ్వానం... ఆట పాటల తో దుమ్ములేపుదాం...

(ఉగాది సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన దలచిన వారు - సంప్రదించండి : చందు - 9843187505)


Tuesday, February 7, 2012


నమస్కారం !                                    నమస్కారం !!                                    నమస్కారం !!!

ఇదిగో...
డప్పు దరువు లేని దండోరా మోగింది...

శాతవాహనుడి సాక్షిగా సంబరం... కోకిల రాగాల ఉగాది సంరంబం...
పిలుస్తోంది ప్రతి తెలుగు బిడ్డను... కొత్త రక్తాన్ని ఇస్తానంటూ...

ఆత్మ గౌరవాన్ని నిలపమంటూ... ఆత్మ సాక్షిగా నిలబడమంటుంది ఉగాది...
పచ్చ తోరణం ల పలకరించి... షడ్రుచులను ఇస్తానంటోంది ఉగాది...

నర నరాన తెలుగు... కణ కణాన తెలుగు...
ఉగాది వెలుగు ఇదిగో... తెలుగు కాగడా అందుకో...

---ఉగాది ఉత్సవ సమావేశానికి ప్రతి తెలుగు సోదరి సోదరులకు  ఆహ్వానం---
     10  - 02 - 2012  శుక్రవారం సాయంత్రం 5 . 30 గం!! లకు 
నమస్కారం !                                    నమస్కారం !!                                    నమస్కారం !!!

ఇదిగో...
డప్పు దరువు లేని దండోరా మోగింది...

శాతవాహనుడి సాక్షిగా సంబరం... కోకిల రాగాల ఉగాది సంరంబం...
పిలుస్తోంది ప్రతి తెలుగు బిడ్డను... కొత్త రక్తాన్ని ఇస్తానంటూ...

ఆత్మ గౌరవాన్ని నిలపమంటూ... ఆత్మ సాక్షిగా నిలబడమంటుంది ఉగాది...
పచ్చ తోరణం ల పలకరించి... షడ్రుచులను ఇస్తానంటోంది ఉగాది...

నర నరాన తెలుగు... కణ కణాన తెలుగు...
ఉగాది వెలుగు ఇదిగో... తెలుగు కాగడా అందుకో...

---ఉగాది ఉత్సవ సమావేశానికి ప్రతి తెలుగు సోదరునికి ఆహ్వానం---
     10  - 02 - 2012  శుక్రవారం సాయంత్రం 5 . 30 గం!! లకు 

Tuesday, January 31, 2012

ఎప్పుడొస్తావు మిత్రమా...!!! బస్సు ఆగినప్పుడల్లా...!!!

నువ్వు నేను మాత్రమే ప్రపంచమంతా అయ్యేవాళ్ళం...

అరవం అరవం అంటూనే అరవ బాష ఆపోసనపట్టాం...
ఆముదం ఆముదం అంటూనే సాపాడు అమృతం లా తిన్నాం...
జేబు లో వంద తో పాండీ నే కొందామని వెళ్ళేవాళ్ళం...
ఇద్దరికే కదలని బండి పై ముగ్గురం సవారి చేసేవాళ్ళం...

మళ్ళీ...!!! ఎప్పుడొస్తావు మిత్రమా...!!! బస్సు ఆగినప్పుడల్లా...!!!

గేటు 1 దగ్గేరైనా గంగ యమునా గుండా పయనించేవాళ్ళం...
బజ్జీల అవ్వ దగ్గెర కారాన్ని చిటికిలేస్తూ చప్పరించేవాళ్ళం...
తల నొప్పికే healthcenter లో అర్ధరాత్రి హడావిడి చేసేవాళ్ళం...
తిరువల్లువార్ దగ్గెర divider పై రాత్రిళ్ళు చలి కాచుకునేవాళ్ళం...

మళ్ళీ...!!! ఎప్పుడొస్తావు మిత్రమా...!!! బస్సు ఆగినప్పుడల్లా...!!!

గంట సేపు అయినా పట్టించుకోని Bhaai  షాప్ దగ్గెర కుడు కుడు అని కొనేవాళ్ళం...
తెలుగు రానోల్లకు తెలుగు బూతులు నేర్పి కడుపుబ్బా నవ్వుకునేవాళ్ళం...
తరీన్ సర్ ను, సాంబార్ నూ తిట్టకుండా నిద్దరే పోనివాళ్ళం...
పక్కనున్న దోస్త్ ను వదిలి, Humanities  block అమ్మాయిలను ఆరాతీసేవాళ్ళం...

మళ్ళీ...!!! ఎప్పుడొస్తావు మిత్రమా...!!! బస్సు ఆగినప్పుడల్లా...!!!

కాగితపు గ్లాసులో ప్రకాష్ కాఫీ సుర్రెవాళ్ళం...
కాలాపేట్ బీచ్ లో అర్ధ నగ్న కవాతు చేసేవాళ్ళం...
పది నిమిషాల PRTC ప్రయాణానికి పది గంటలు చిరాకు పడేవాళ్ళం...
JN, MG వీధులు  కలియ తిరిగి, అలసి సొలసి వాల్మీకి కన్నదాసన్ చేరుకునేవాళ్ళం...

మళ్ళీ...!!! ఎప్పుడొస్తావు మిత్రమా...!!! బస్సు ఆగినప్పుడల్లా...!!!

                           --- రామకృష్ణ కొంగల్ల---



Wednesday, January 4, 2012

     ---అందమంటే---

అందాన్ని వెదుకుతాను నేను...
నాన్న చేతి ఎంగిలి వేళ్ళలో.. 
తాత పిలకలో... గతికే గంజి నీళ్ళలో...
బోదించే మాస్టారు చెమట చుక్కల్లో... 
కత్తరించని నా నేస్తం గోళ్ళ ధూళిలో...
దోస్త్ పిలిచే "మామా" అనే మాటలో... 
చిరాకులో "పోబే" అనే అశాంతి లో...

అందాన్ని వెదుకుతాను నేను...
అమ్మ పాద ధూళిలో... అక్క జడలో... 
మట్టి పిసికే చేతిలో... బొచ్చె లోని బిళ్లలో...
అవ్వ నషం డబ్బాలో... అత్త ముక్కు పుడకలో... 
కలాన్ని కదిపే వేళ్ళలో... రంగుల్ని ముద్దాడే కుంచెలో..
      ---రామకృష్ణ కొంగల్ల--
        --- నేనంటే నేనే---
ఎదలు రగిలే సంవేదన తో...
ఆర్తి చిత్రాన్ని గీస్తూ... అక్షరాల్లో దగ్దమవుతూ...
కవితాకాసంలో చుక్కలా... అజరామర గీతంలా...
అనుభవం వయస్సు అని, స్థలమే కులమని గనీ...
కాలి గజ్జే కదిలేలా డప్పు పై వేళ్ళు అదిరించి...
మతం లేదని, నా రక్తం ఎరుపన్నా...
పిచ్చే అనుకో... వెర్రే అనుకో...
మూడు చుక్కలు నా కవితలు... మూడు గీతలు నా బొమ్మలు...
తీన్ మాటలు నా పాటలు... "తీన్ మార్లు"  నా దరువులు...
           ---రామకృష్ణ కొంగల్ల---

Monday, January 2, 2012

రుధిర రొదలు...       పెజల వెడలు...
అనంత గేలి...           అనూహ్య నష్టం...
ప్రాణాలు అరచేత...   చిదిమి కడలి చెంత...
తెరని కళ్ళు...          తెరవని ద్వారాలు....
నడవని కాళ్ళు...     నడకలేని దారులు...
అగచాట్లు...             వలస పాట్లు...
సుక్క నీటి కోసం...  బుక్క బువ్వ కోసం...
పట్నామంతా...       కాడి...      గాడి...
                 సర్వం చిద్రం...
హవ్వ....!!!    చెత్త చేసావ్...!!!     చితి పరిచావ్...!!!
                       ఆర్తి గాను...
              తానే... ప్రాణం పాయె నే...!!!!

                   ---రామకృష్ణ---