దశా దిశా లేని మీడియా ను తులనాడుతూ...పెరిగిన ధరలకు కేంద్రాన్ని నిందిస్తా...
నా ఇంట్లో చెత్తను పక్క వాకిట్లో వేస్తూ... రోడ్లపై ఉమ్మితే ప్రభుత్వాన్ని భాధ్యున్ని చేస్తా...
పెరిగే మానబంగాలకు ప్రతి మగాడిని బాద్యున్ని చేస్తూ... తొడల పైకి మిడ్డి వేసే ప్రతి ఆడదాన్ని తిడతా...
పైరసీ ని తిడతా... సీరియల్స్ ను తిడతా... సినిమా ల ను తిడతా... ఫారిన్ కల్చర్ ను తిడతా...
క్రికెట్ కు దేశ భక్తి కి ముడిపెట్టి... గెలిచిన ప్రతిసారి జెండా తో వీధి వీధి తిరుగుతా....
ఆకలి చావుల్లో నా దేశం వెలిగి పోతున్ధంటూ... లక్ష కోట్లు తిన్న వారిని పార్లమెంటు లో కూర్చోబెడతా...
నా దేశం బీధదని నిట్టూర్చి బిరియాని తింటూ... ఆడీ కారు లో కుర్చుని వీధి బాలున్ని విసుక్కుంటా...
రిజర్వేషన్ పేరుతో యువతును పీడించే రాజ్యాంగాన్ని నిందిస్తూ...
సత్యమేవ జయతే చూసి కసిగా కన్నీరు పెట్టి మరిచిపోతా...
చెత్త ప్రభుత్వం అని తిడతా కాని... పచ్చ నోటు కు ఆశపడి వోటు వేసిన వేదవను నేను కాదనుకుంటా...
దేశమంతా దొంగలు లంగలు ఉన్నారంటూ... నేనొక్కడినే ఆరిందను అనుకుంటా...
ఎన్ని యుగాలు గడిచినా... నేను అభివృద్ధి చెందే వాడినే అంటూ...
వీటన్నింటికీ... నేను మాత్రమే కారణం అన్న విషయం మరిచిపోతా...
No comments:
Post a Comment