7 రంగుల పుడమి... 7 మతాల లోగిలి...
7 అడుగుల అజానుబావులు... ఎదలు పొంగే కధలు...
7 అంతస్తుల అద్దాలమేడ అంచున... 7 అడుగుల గుడిసెలు...
7 వేల కోట్లు తిన్న దొంగలకు... 7 నెలలే ఊచలు...
7 రాజకీయ కుర్చీలకు... 7 వేల మంది ఊగిసలు...
7 రోజులు సరిపోని హడావుడి ప్రపంచెం లో... 7 నెలలకే కానుపులు...
7 ఏళ్ళ చిచ్చర పిడుగులు... ఏడిచే వింతలు...
7 కొండల వాడి సమక్షం లో... ఎడతెగని కోర్కెల బక్తులు...
7 గజాల చీరపై కి.. 7 ఇంచ్ ల బుజాలు లేని జాకెట్లు...
7 మీటర్ ల విసురు రోడ్ల పై... అలుపెరుగని పయనాలు....
7 అడుగుల తలంబ్రాలు... ఎ 4 విడాకు పత్రాలు...
7 ఖండాల్లో... సప్త సంద్రాల్లో.... నాటికి నేటికి... ఎంత చెప్పినా... ఒడవని కథ...
నా భారతం... అనంత భారతం...
నా భారతం... అమర భారతం...
No comments:
Post a Comment