ఒక్కరోక్కరు వెళుతున్నారు...
ఒక్కొక్కరుగా వెళుతున్నారు...
ఒక్కొక్కరే అయి వెళుతున్నారు...
గంటల పరిచయాలు... గతుల జ్ఞాపకాలు...
క్షణాల మాటలు... యుగాల ఊసులు...
ఆసాంతం మురిపించి... అమాంతం ఏడిపించి...
స్మృతులు మిగిల్చి... ఎదలు చితులు చేసి...
కానలకేగినట్లు కనపడక పోతారు...
అదుపు లేని పాశం.. అవధులు లేని శోకం...
కలిసి తిరిగిన పర్వం... గర్వం... గంభీర్యం...
ఏ చోట వెతకను... నీవు సర్వాంతర్యామి వి...
నువ్వు వెళ్ళిన నన్ను... ఒంటరినని వెక్కిరించే...
పరిసరాలకు ఏమని చెప్పను... నేస్తమా.... నేస్తమా....
పూలు అమ్మిన చోట... కట్టెలు అమ్మడం.. నాకు చేతకాదు...
No comments:
Post a Comment