మొదట చేరినప్పుడు
మౌనంగా నా గదిలో ఒంటరిగా ప్రాంగణం లో
ఆశలు ఆశయాలు లేని మనసు భారంగా వున్నప్పుడు
అమ్మ నాన్న అక్క చెల్లి అన్నదమ్ముల మాటలు మెదులుతున్నప్పుడు
ఎడారి లో ఎండమావి లా నీ పలకరింత నీ పరిచయం
ఒక్క పూట ఒక్క రోజు ఒక్క వారం ఒక్క నెల ఒక్క వత్సరం
ఇప్పుడదంతా ఒక్క జీవితం
కలిసి తిరిగిన రోడ్లు చెట్లు పుట్టలు
కన్నీరు తెప్పించే సరదా కబుర్లు చేట్టాల్ పట్టాలు
నీ ధైర్యం తో చేసిన పనులు ఒకటా రెండా
నా రోజు నీ తో మొదలు నా రోజు నీతో తుదలు
నవ్వాం ఏడ్చాం స్వర్గాన్ని చూసాం...
కలిసి నిల్చున్నాం ఎదురు నిలబడ్డం
ఇద్దరం ఒక్కటై ప్రపంచాన్ని ఆస్వాదించాం
ఇద్దరం వున్నా ప్రతి క్షణాన్ని ప్రేమించాం
మనది అనుకున్నాం మనదంటూ ఏదో వున్ధనుకున్నాం
ఏమి లేకుండ్డా వెళుతున్నాం
నీ వద్ద నా ఎద నా వద్ద నీ ఎద తప్ప
ఆహే చ్చల్... ఎంతని బాధపడను నేస్తమా...
ఎవరున్నా లేకున్నా... పూచే పూలు పూస్తూనే వుంటాయి...
No comments:
Post a Comment