నడిచేటి దారిలో... నా కంటి పాపలో...
నీ కొరకు చూసినా... నీ రూపు దాచినా...
మురిపించే... మైమరిపించే...
ఆర్ధ్రమా...ఆత్రమా.. స్వప్నమా...
ఎద ధాటి వెళ్ళినా... ఎదురీది చేరినా...
మన గమ్యాలు రెండు కొసలు...
వ్యక్తిత్వాల అంతరం అగమ్య గోచరం...
ఓ... పిల్లా... చూడు... మనసు తెలిసి బాసాడు...
నా ముళ్ళ దారిలో... నీ పయనం ఎన్నాళ్ళు...
ఆ కంచే దాటిన ఆనందం గడియలు...
భయం... వొదులు... వెళ్ళు... వెంటాడు... నైన మెరుగని వైనం...
క్షణం క్షణం మరణం... ప్రతీ క్షణం మధురం...
మరణ పాదాలు ముద్దాడి ప్రాకృతిక ప్రపంచం నుండి...
వేరై... విదియై... వెలియై... ఎడమై...
పొరలు పొరలు గా ఒలవబడి... శాఖ శాఖలు గా విరవబడి...
సాగనీ నన్ను... కదలనీ నన్ను...
కానల్లో... కన్నుల్లో... కరునల్లో....
కానరాని కర్కశం లో... నా సహజాత కవితల్లో...
No comments:
Post a Comment