నీవేవరితో నడిచినా... అది గతమే....
నాతో రెండడుగులు నడువు... అందులోని ప్రతి క్షణాన్ని బంగారు అక్షరాలతో దిద్దుకుంటా...
నీవేవరితో మాట్లాడినా వింటారు అంతే...
నాతో రెండు మాటలు మాట్లాడు... ప్రతి పదాన్ని హృదయంలో పదిల పదిల పరుస్తా...
నాతో నువ్వున్న సమయాన్ని ఆగిపోమ్మని వేల సార్లు కోరుకుంటాను...
నాతో నువ్వు నవ్వుకున్న ఊసుల్ని నయనాల్లో దాచుకుంటాను...
నీ జీవితంలో ఎంతో మంది వచ్చిపోతారు.. నిన్ను మరుగున వేస్తారు...
నా జీవితం లోని నిన్ను మాత్రం...
శాశ్వతంగా పదిలపరుస్తా... ఆరాధిస్తూ కోవెల కడతా...
నన్ను పట్టించుకోని నాడు నీకు కన్నీటి అభిషేకాలు చేస్తా...
నేను నిన్ను ప్రేమిస్తేనే కదా... నీకు ఈ ప్రపంచాన ఓ విలువ...

No comments:
Post a Comment