--- నేనంటే నేనే---
ఎదలు రగిలే సంవేదన తో...
ఆర్తి చిత్రాన్ని గీస్తూ... అక్షరాల్లో దగ్దమవుతూ...
కవితాకాసంలో చుక్కలా... అజరామర గీతంలా...
అనుభవం వయస్సు అని, స్థలమే కులమని గనీ...
కాలి గజ్జే కదిలేలా డప్పు పై వేళ్ళు అదిరించి...
మతం లేదని, నా రక్తం ఎరుపన్నా...
పిచ్చే అనుకో... వెర్రే అనుకో...
మూడు చుక్కలు నా కవితలు... మూడు గీతలు నా బొమ్మలు...
తీన్ మాటలు నా పాటలు... "తీన్ మార్లు" నా దరువులు...
---రామకృష్ణ కొంగల్ల---
No comments:
Post a Comment