ఎప్పుడొస్తావు మిత్రమా...!!! బస్సు ఆగినప్పుడల్లా...!!!
నువ్వు నేను మాత్రమే ప్రపంచమంతా అయ్యేవాళ్ళం...
అరవం అరవం అంటూనే అరవ బాష ఆపోసనపట్టాం...
ఆముదం ఆముదం అంటూనే సాపాడు అమృతం లా తిన్నాం...
జేబు లో వంద తో పాండీ నే కొందామని వెళ్ళేవాళ్ళం...
ఇద్దరికే కదలని బండి పై ముగ్గురం సవారి చేసేవాళ్ళం...
మళ్ళీ...!!! ఎప్పుడొస్తావు మిత్రమా...!!! బస్సు ఆగినప్పుడల్లా...!!!
గేటు 1 దగ్గేరైనా గంగ యమునా గుండా పయనించేవాళ్ళం...
బజ్జీల అవ్వ దగ్గెర కారాన్ని చిటికిలేస్తూ చప్పరించేవాళ్ళం...
తల నొప్పికే healthcenter లో అర్ధరాత్రి హడావిడి చేసేవాళ్ళం...
తిరువల్లువార్ దగ్గెర divider పై రాత్రిళ్ళు చలి కాచుకునేవాళ్ళం...
మళ్ళీ...!!! ఎప్పుడొస్తావు మిత్రమా...!!! బస్సు ఆగినప్పుడల్లా...!!!
గంట సేపు అయినా పట్టించుకోని Bhaai షాప్ దగ్గెర కుడు కుడు అని కొనేవాళ్ళం...
తెలుగు రానోల్లకు తెలుగు బూతులు నేర్పి కడుపుబ్బా నవ్వుకునేవాళ్ళం...
తరీన్ సర్ ను, సాంబార్ నూ తిట్టకుండా నిద్దరే పోనివాళ్ళం...
పక్కనున్న దోస్త్ ను వదిలి, Humanities block అమ్మాయిలను ఆరాతీసేవాళ్ళం...
మళ్ళీ...!!! ఎప్పుడొస్తావు మిత్రమా...!!! బస్సు ఆగినప్పుడల్లా...!!!
కాగితపు గ్లాసులో ప్రకాష్ కాఫీ సుర్రెవాళ్ళం...
కాలాపేట్ బీచ్ లో అర్ధ నగ్న కవాతు చేసేవాళ్ళం...
పది నిమిషాల PRTC ప్రయాణానికి పది గంటలు చిరాకు పడేవాళ్ళం...
JN, MG వీధులు కలియ తిరిగి, అలసి సొలసి వాల్మీకి కన్నదాసన్ చేరుకునేవాళ్ళం...
మళ్ళీ...!!! ఎప్పుడొస్తావు మిత్రమా...!!! బస్సు ఆగినప్పుడల్లా...!!!
--- రామకృష్ణ కొంగల్ల---
No comments:
Post a Comment