ఎన్నో మూటల మాటలు చెబుతావు... వాటితో కోటలు కట్టొచ్చు...
నీవు నాకు వునావన్న భరోసా మాత్రం కల్పించవు...
ఊహల్లో ఉయ్యాలలూపి... కళల తీరంలో కబుర్లు చెబుతావు...
నీవు నాకు మాత్రమేనన్న నమ్మకాన్ని కల్గించవు...
నాతో పాటు దూరాలు నడిచి... ఒంటరి తనాన్ని తరుముతావు...
నిరంతరం నడకలో తోడుగా ఉంటానన్న భద్రతను బహిర్గతం చేయవు...
నా ఆనందాన్ని అందుకుంటావు... వాటి కారణాలు చూడవు...
నా బాధలో తోడవుతావు... బాధల నేపధ్యం గానవు...
నా కన్నీటి దారాలు నిరోదిస్తావు... వాటి మూలాలను అన్వేషించవు...
నా కోసమే బ్రతుకుతూ... నిన్ను నీవు మరవకు...
నిన్ను నీవు మరిచి... నన్ను మాత్రం మరుగున వేయకు...!!!

No comments:
Post a Comment