తనను వర్ణిద్దాం అనుకున్నానా..,
అనుకున్న ఆలోచనలు చేజారి... చందమామ లా చల్లని భావాలై...
భావాల కెరటాల్లోని కేరింతలు... కేరింతల కలం లోని కవ్వింతలు...
కవ్వింతల కాగితపు వాసనలు... వాసనల వేవేల నయనాలు...
నయనాల ముక్కోటి మురిపాలు... మురిపెం లోని ముత్యాలు...
ముత్యాల చేచిక్కని పాద కుసుమాలు... కుసుమాల నవ మన్మధ బాణాలు...
బాణాల మకరందపు మువ్వలు... మువ్వల వలె భానుని భరినెలు...
భరిణె లో పసుపు కుంకుమ చందనాలు... చందనాల పసిడి వెండి పూరేకులు...
పూరేకుల పొద్దు తిరుగుడు చేమంతి చెక్కిళ్ళు... చెక్కిళ్ళ పై అప్పుడే మొలిచిన సిగ్గు వజ్రాలు...
వజ్రాల తెల్లని పళ్ళ వరుసలు... పల్లల్లోని ముత్యాలు జారి మెడ మంగళ హారాలై...
నఖ శిఖ పర్యంతం సర్వం, సమస్తం, నివ్వెర పోయ్యేను...
ఓ... లావణ్య లలనా... !!! నాలుగు పంక్తుల్లో నిన్ను వర్ణింప, నేను తగునా...!!!

No comments:
Post a Comment